బురారీ మిస్టరీ: తాంత్రికుడు జనేగడి కోసం పోలీసుల వేట
- తాంత్రిక బాబా కోసం రంగంలోకి పోలీసులు
- వారిది ఆత్మహత్య కాదంటున్న బంధువులు
- ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని అనుమానం
మరోవైపు, ఆత్మహత్యలకు పురిగొల్పిన తాంత్రిక బాబా జనేగడి కోసం పోలీసులు వేట ప్రారంభించారు. అతడు కనుక చిక్కితే ఈ కేసులో చిక్కుముడి దాదాపు వీడుతుందని పోలీసులు చెబుతున్నారు. ఆత్మహత్యకు పాల్పడిన ఇంటి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న డైరీ వారికి క్షుద్రపూజలపై అచంచల విశ్వాసం ఉన్న విషయాన్ని తెలియజేస్తోందని పోలీసులు చెబుతున్నారు . తాంత్రికుడు దొరికితే ఈ కేసు మొత్తం ఓ కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు. దీంతో అతడిని పట్టుకునేందుకు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి.