ముస్లింలలో ‘నిఖా హలాల’ ఆచారానికి వ్యతిరేకంగా వాదనలు వినిపించనున్న కేంద్రం!
- లింగపరమైన న్యాయసూత్రాలకు విరుద్ధమని భావిస్తున్న కేంద్రం
- ఈ ఆచారాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లు
- విచారించనున్న రాజ్యాంగ ధర్మాసనం
నిఖా హలాల అంటే ఇస్లాంలో వివాహాన్ని అనుమతించడం అని. ఈ ఆచారంలో ఓ పురుషుడు ఒకే మహిళకు విడాకులు ఇచ్చి రెండు పర్యాయాలు వివాహం చేసుకోవచ్చు. మళ్లీ బంధాన్ని తెంచుకుంటే, మూడో సారి వివాహం చేసుకునేందుకు షరతులు వున్నాయి. సదరు మహిళ మరొకరిని వివాహం చేసుకుని వితంతువుగా మారి ఉండాలి. లేదా ఆమె విడాకులు తీసుకుని అయినా ఉండాలి. అప్పుడే ఆ మహిళను సంబంధిత వ్యక్తి మూడో సారి భార్యగా స్వీకరించొచ్చు. ఈ ఆచారం లింగపరమైన న్యాయసూత్రాలకు విరుద్ధమని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.