ఏమ్నేషియా క్లబ్ లో దారుణం... వ్యభిచారం చేయట్లేదని యువతిపై దాడికి దిగిన జంట!
- సమీరా అనే యువతిపై ఫిరోజ్, కీర్తి రెడ్డి దాడి
- వాగ్వాదానికి దిగి, ఆపై బ్లేడ్ తో దాడి
- కేసు నమోదు చేసుకున్న పోలీసులు
ఈ క్రమంలో ఏమ్నేషియా క్లబ్ కు ముగ్గురూ వెళ్లి మందు కొట్టారు. సమీరకు పూటుగా మద్యం తాగించిన ఫిరోజ్, కీర్తి రెడ్డి, ఆపై ఆమెతో వాగ్వాదానికి దిగారు. గతంలో వీరిమధ్య ఉన్న వివాదం నేపథ్యంలో ఫిరోజ్ పై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలంటూ సమీరను బెదిరించారు. తాము చెప్పినట్టు వినాల్సిందేనంటూ దాడి చేశారు. ఆపై అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఘటన అనంతరం క్లబ్ యాజమాన్యం ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. సమీరను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్టు వెల్లడించారు.