దేశంలోనే టీఆర్ఎస్ అవినీతికర ప్రభుత్వం: బీజేపీ నేత మురళీధర్ రావు

  • కాంగ్రెస్ కి టీడీపీ, టీఆర్ఎస్ లు జేబు సంస్థలుగా మారాయి
  • దేశ భద్రత, సంస్కృతిని వ్యతిరేకించే స్థాయికి కాంగ్రెస్ దిగజారింది
  • 2019 ఎన్నికలకు బీజేపీ సిద్ధంగా ఉంది
కాంగ్రెస్ పార్టీకి టీడీపీ, టీఆర్ఎస్ పార్టీలు జేబు సంస్థలుగా పనిచేస్తున్నాయని, దేశంలోనే టీఆర్ఎస్ అవినీతికర ప్రభుత్వమని బీజేపీ నేత మురళీధర్ రావు ఆరోపించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, దేశ భద్రత, సంస్కృతిని వ్యతిరేకించే స్థాయికి కాంగ్రెస్ పార్టీ దిగజారిందని విమర్శించారు. జమ్మూలో సైపుద్దీన్ సోజ్, ఆజాద్ వేర్పాటు వాదుల భాష మాట్లాడుతున్నారని, వారి భాష సైనికుల మనో ధైర్యాన్ని దెబ్బతీస్తుందని, రాజకీయాల కోసం వేర్పాటువాదులతో అంటకాగడం సరికాదని అన్నారు. దక్షిణ భారతదేశంలో పూర్తి ప్రణాళికతో ముందు కెళ్తామని, 2019 ఎన్నికలకు బీజేపీ సిద్ధంగా ఉందని చెప్పారు.
Go Back to Shorts
TRS
bjp
muraldhara rao

More Telugu News