గుంటూరులో బ్యూటీషియన్ సిరి, హైదరాబాద్ లో ఆమె ప్రియుడు... జంట ఆత్మహత్యల కేసులో మిస్టరీ ఛేదించే పనిలో పోలీసులు!
- ఓ యువకుడిని ప్రేమించిన సిరి
- పెళ్లికి అంగీకరించని పెద్దలు
- విషయం ప్రియుడికి చెప్పి ఆత్మహత్య
తొలుత రెండూ వేర్వేరు కేసులుగానే నమోదు చేసుకున్న పోలీసులు, విచారణలో ఒకరి ఫోన్ నంబర్ మరొకరి సెల్ ఫోన్ లో ఉండటంతో ఆత్మహత్యల వెనకున్న మిస్టరీపై దృష్టిని సారించారు. యాదగిరిగుట్టకు చెందిన సిరి, గత కొంతకాలంగా ఓ యువకుడిని ప్రేమిస్తోంది. ఈ విషయం ఇంట్లో వాళ్ల పెద్దలకూ తెలుసు. అయితే, పెళ్లికి రెండు కుటుంబాల వాళ్లూ అంగీకరించలేదు.
ఈ క్రమంలో మనస్తాపానికి గురైన ఈ జంట ఆత్మహత్య చేసుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. సిరి చనిపోవడానికి ముందు తను ప్రేమించిన యువకుడికి ఫోన్ చేసినట్టు తెలుస్తుండటంతో, ఇక ఆమె చనిపోతుందని, దాన్ని తాను ఆపలేనని భావించిన యువకుడు కూడా ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.