సమయం చూసి చంద్రబాబుకు అన్ని విషయాలూ చెబుతా!: గంటా శ్రీనివాస్
- నాపై అసంతృప్తి లేదు
- చంద్రబాబుకు విషయం చెబుతా
- అలక వీడిన తరువాత మంత్రి గంటా
తాను తిరిగి భీమిలి నుంచే పోటీ చేస్తానని, గెలుస్తానన్న నమ్మకం ఉందని చెప్పిన ఆయన, తనపై వ్యతిరేకత లేదని చంద్రబాబుకు స్పష్టం చేయాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు. మధ్యాహ్నం చంద్రబాబు పాల్గొనే కార్యక్రమంలో తాను కూడా పాల్గొంటానని, సమయం చూసి ఆయనకు అన్ని విషయాలూ చెబుతానని అన్నారు. భీమిలిలో ఆయనపై వ్యతిరేకత ఉందని లగడపాటి టీమ్ నిర్వహించిన సర్వేలో తేలినట్టు వార్తలు రావడంతో, ప్రభుత్వ కార్యక్రమాలకు గంటా దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.