మోదీ గారూ.. వంద తలలు నరికి తీసుకురండి.. మీరు చేయకపోతే.. ఆ పని మేమే చేస్తాం: జవాన్ ఔరంగజేబ్ సోదరుడు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మోదీ గారూ.. వంద తలలు నరికి తీసుకురండి.. మీరు చేయకపోతే.. ఆ పని మేమే చేస్తాం: జవాన్ ఔరంగజేబ్ సోదరుడు

  • భారత జవాను ఔరంగజేబ్ ను పాశవికంగా చంపిన ఉగ్రవాదులు
  • ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకోకపోతే.. ఆ పని తామే చేస్తామన్న ఔరంగజేబ్ సోదరుడు
  • ఔరంగజేబ్ సోదరుడు కూడా జవానే
పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు జమ్ముకశ్మీర్ లో భారత జవాను ఔరంగజేబ్ ను అత్యంత పాశవికంగా కాల్చి చంపిన ఘటన యావత్ దేశాన్ని విషాదంలో ముంచి వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఔరంగజేబ్ సోదరుడు ఉగ్రవాదులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ఓ విన్నపం చేశాడు. మోదీ గారూ... మా సోదరుడుని చంపిన ఉగ్రవాదులపై మీరు ప్రతీకారం తీర్చుకుంటారా? లేదా ఆ పనిని మమ్మల్యే చేయమంటారా? అని ప్రశ్నించారు. తన అన్న మరణానికి ప్రతీకారంగా వంద మంది ఉగ్రవాదుల తలలు నరికి తీసుకురండి అని చెప్పారు.

ఔరంగజేబ్ సోదరుడు కూడా జవానుగానే పని చేస్తున్నాడు. తన సోదరుడి మరణంతో రంజాన్ కూడా జరుపుకోలేదని... తమ గ్రామమంతా విషాదంలో మునిగిపోయిందని చెప్పాడు. ఈ సాయంత్రంలోగా ఘటనకు సంబంధించిన వివరాలను మీరు ఇవ్వాలని... లేకపోతే తానే రాష్ట్రీయ రైఫిల్స్ కార్యాలయానికి వచ్చి, ప్రభుత్వంతో మాట్లాడి, ఏం చేయాలో నిర్ణయిస్తానని తెలిపాడు. మరోవైపు, ఔరంగజేబ్ తండ్రి కూడా కేంద్ర ప్రభుత్వానికి 72 గంటల గడువు ఇచ్చారు. 
aurangzeb
brother
modi
warning

More Telugu News