ఫేస్ బుక్ మోసం కేసులో మరో మలుపు... ఫొటోల్లో ఉన్నది ఎవరో చెప్పేసిన ఉపేంద్ర ప్రియురాలు!
- ఫొటోల్లో ఉన్నది కాలేజీ స్నేహితుడే
- గతంలో సన్నిహితంగా ఉండేవాళ్లం
- విభేదాలు వచ్చి విడిపోయాం
- మీడియాకు వెల్లడించిన సోనూ
తనను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చినందునే ఉపేంద్రను నమ్మానని చెప్పారు. సురేంద్ర ఆరోపిస్తున్నట్టుగా, తనకు ఎవరితోనూ సంబంధాలు లేవని, ఆ ఫొటోల్లో ఉన్న యువకుడు తన కాలేజీ స్నేహితుడని, ఒకప్పుడు అతనితో చనువుగా ఉన్నానని, ఆపై విభేదాలు రావడంతో తాము విడిపోయామని తెలిపారు. దాన్ని అడ్డు పెట్టుకుని ఇప్పుడు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తనను ఉపేంద్ర నమ్మించి మోసం చేశాడని సోనూ ఆరోపించింది.