అప్పట్లో ఆ హీరో పెద్ద సరసాల రాయుడు: జయప్రద
- ఒకప్పటి హీరోలలో ధర్మేంద్ర పెద్ద సరసాల రాయుడని చెప్పిన జయప్రద
- రాజేష్ ఖన్నా సెట్‌కు ఎప్పుడూ ఆలస్యంగా వచ్చేవారని వెల్లడి
- రోజుకు 5 షిఫ్టులు పనిచేస్తూ తీవ్రంగా కష్టపడ్డానని గుర్తుచేసుకున్న నటి
- షూటింగ్ కోసం ఎయిర్‌పోర్ట్‌లోనే స్నానం చేసి ఫ్లైట్‌లో మేకప్ వేసుకున్న వైనం
- ఎన్టీఆర్, రాజ్‌కుమార్ వంటి దిగ్గజాలతో 16 ఏళ్లకే పనిచేశానని వెల్లడి
ప్రముఖ నటి జయప్రద తన కెరీర్ తొలినాళ్లలోని ఆసక్తికర జ్ఞాపకాలను పంచుకున్నారు. కపిల్ శర్మ షోకు సంబంధించిన ఓ పాత వీడియో క్లిప్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆమె తన సహనటుల గురించి సరదా వ్యాఖ్యలు చేశారు. ఆ రోజుల్లో హీరోలలో అత్యంత సరసాల రాయుడు ఎవరని కపిల్ అడగ్గా, ఆమె నవ్వుతూ "ధర్మేంద్ర" అని సమాధానమిచ్చారు.
ఇక సెట్‌కు ఆలస్యంగా వచ్చే హీరో ఎవరనే ప్రశ్నకు, ఆమె రాజేష్ ఖన్నా పేరు చెప్పారు. "నేను దక్షిణాది నుంచి వచ్చాను. అక్కడ ఉదయం 7 గంటలకే సెట్స్‌లో ఉండేదాన్ని. కానీ బాలీవుడ్‌లో 9 గంటలకు రమ్మనేవారు. నేను మేకప్ పూర్తి చేసుకుని సిద్ధంగా ఉన్నా, రాజేష్ ఖన్నా గారు రాత్రి 8 గంటలకు వచ్చేవారు. వచ్చి వడా పావ్ తిని, ఒక షాట్ ఇచ్చి 9 గంటలకు ప్యాకప్ చెప్పేవారు" అని జయప్రద ఆ నాటి పరిస్థితులను వివరించారు.
ఆ రోజుల్లో తాను ఎదుర్కొన్న కష్టాల గురించి కూడా జయప్రద మాట్లాడారు. ఒకే రోజులో 5 షిఫ్టులు కూడా పనిచేసేదాన్నని తెలిపారు. "షరాబి" సినిమా షూటింగ్ సమయంలో ఊటీ నుంచి సాయంత్రం రైలెక్కి చెన్నై చేరుకునేదాన్నని, అక్కడి ఎయిర్‌పోర్ట్‌లోనే స్నానం చేసి ఫ్లైట్ ఎక్కేదాన్నని గుర్తుచేసుకున్నారు. విమానంలో ప్రయాణిస్తూనే మేకప్ పూర్తి చేసుకుని కోయంబత్తూరులో షూటింగ్‌కు హాజరయ్యేదాన్నని చెప్పారు.
ఇలాంటి పరిస్థితులు కష్టంగా ఉన్నప్పటికీ, గర్వంగా అనిపించేదని ఆమె అన్నారు. దక్షిణాదిలో ఎన్టీఆర్, రాజ్‌కుమార్ వంటి దిగ్గజ హీరోలతో పనిచేసేటప్పుడు తాను కేవలం 16-17 ఏళ్ల అమ్మాయినని, వారితో పనిచేయడం వల్ల ఎంతో క్రమశిక్షణ నేర్చుకున్నానని జయప్రద తెలిపారు.