ఎయిర్ టెల్ కస్టమర్లకు గుడ్ న్యూస్... ఒకటే బిల్లు... 10 శాతం డిస్కౌంట్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎయిర్ టెల్ కస్టమర్లకు గుడ్ న్యూస్... ఒకటే బిల్లు... 10 శాతం డిస్కౌంట్

  • ఎన్ని కనెక్షన్లు ఉన్నా గానీ సమగ్రమైన బిల్లు ఒక్కటే
  • ప్రత్యేకంగా కస్టమర్ కేర్ సేవలు
  • మై ఎయిర్ టెల్ యాప్ లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది
భారతీ ఎయిర్ టెల్ ఓ కొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. ఈ సంస్థ ప్రీ పెయిడ్, పోస్ట్ పెయిడ్  సెల్యులర్ సేవలు, హోమ్ బ్రాడ్ బ్యాండ్, డీటీహెచ్ తదితర సేవల్లో ఉన్న విషయం తెలిసినదే. ఎయిర్ టెల్ సేవల్లో ఒక్కటికి మించి వాడే వారికి ఇకపై వేర్వేరు బిల్లులు జారీ చేయకుండా ఎన్ని కనెక్షన్లు, సేవలు పొందుతున్నా గానీ ఒకే సమగ్రమైన బిల్లు జారీ చేస్తుంది. అంతేకాదు, బిల్లు మొత్తంపై 10 శాతం తగ్గింపు ఇస్తుంది. దీనికి ఎయిర్ టెల్ హోమ్ అని పేరు పెట్టింది. అంటే ఒక ఇంటికి ఎన్ని కనెక్షన్లున్నా బిల్లు ఒక్కటే అని. ఒక్కటికి మించి ఎయిర్ టెల్ సేవలు పొందే వారిని ప్రీమియం కస్టమర్లుగా పరిగణిస్తుంది. వీరి కోసం వేగంగా స్పందించేందుకు ప్రత్యేకంగా కస్టమర్ కేర్ విభాగాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ సేవ కోసం ఎయిర్ టెల్ కస్టమర్లు మై ఎయిర్ టెల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ లో ఎయిర్ టెల్ కు సంబంధించిన కనెక్షన్లు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
airtel cuatomers
single bill

More Telugu News