చెర్రీ .. బోయపాటి మూవీ రిలీజ్ సంక్రాంతికే?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చెర్రీ .. బోయపాటి మూవీ రిలీజ్ సంక్రాంతికే?

  • బోయపాటితో చరణ్ మూవీ 
  • కొనసాగుతోన్న రెండవ షెడ్యూల్ షూటింగ్
  • మూడవ షెడ్యూల్ కి సన్నాహాలు    
ప్రస్తుతం చరణ్ .. బోయపాటి సినిమా షూటింగులో బిజీగా వున్నాడు. ఈ సినిమా రెండవ షెడ్యూల్ షూటింగును జరుపుకుంటోంది. వచ్చేనెల రెండవ వారంతో ఈ షెడ్యూల్ ముగియనుంది. మూడవ షెడ్యూల్లో ప్రధానమైన పాత్రల మధ్య అతిముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టుగా సమాచారం. సంక్రాంతి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమాను జనవరి 11వ తేదీన విడుదల చేయాలని భావిస్తున్నారట.

అయితే ఎన్టీఆర్ బయోపిక్ ను కూడా సంక్రాంతికే విడుదల చేయనున్నట్టు బాలకృష్ణ ఆల్రెడీ ఎనౌన్స్ చేసేశారు. బాలకృష్ణకి సంక్రాంతి సెంటిమెంట్ ఉందనే సంగతి తెలిసిందే. అందువలన సంక్రాంతికి ఎన్టీఆర్ బయోపిక్ వచ్చే అవకాశాలు ఎక్కువగానే వున్నాయి. బాలకృష్ణ సినిమా .. అందునా అది ఎన్టీఆర్ జీవితచరిత్ర కనుక, చరణ్ గట్టిపోటీనే ఎదుర్కోవలసి ఉంటుంది. అయినా ఓకే అనుకుని రంగంలోకి దిగుతారా? లేదంటే విడుదల తేదీని మార్చుకుంటారా? అనేది చూడాలి.      
charan
boyapati

More Telugu News