ఉప ఎన్నికల ఫలితాల ట్రెండ్స్... ఎక్కడా కనిపించని బీజేపీ ఆధిక్యం!

  • 4 పార్లమెంట్ 11 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు
  • ఈ ఉదయం ప్రారంభమైన కౌంటింగ్
  • యూపీలోని కైరానాపైనే అందరి దృష్టి
పలు రాష్ట్రాల్లో వివిధ కారణాల వల్ల ఖాళీ అయిన 4 ఎంపీ, 11 ఎమ్మెల్యే స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ ఉదయం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రారంభం అయింది. ఈ ఫలితాల్లో తొలి ట్రెండ్స్ బీజేపీకి వ్యతిరేకంగా కనిపిస్తున్నాయి. పంజాబ్ లోని షాకోట్ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఉత్తరప్రదేశ్ లోని నూర్పూర్ అసెంబ్లీ స్థానంలో సమాజ్ వాదీ, పశ్చిమ బెంగాల్ లోని మహేష్తలా అసెంబ్లీ స్థానంలో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు.

ఇక మహారాష్ట్రలోని పాల్ ఘర్ అసెంబ్లీ స్థానంలో శివసేన అభ్యర్థి లీడింగ్ లో ఉన్నారు. ఇక అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న యూపీలోని కైరానా ఎంపీ స్థానానికి జరిగిన పోటీలో సమాజ్ వాదీ, బహుజన సమాజ్, కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసిన ఆర్ఎల్డీ అభ్యర్థి తబస్సుమ్ హసన్ బీజేపీ అభ్యర్థి మ్రిగాంకా సింగ్ కన్నా ముందంజలో ఉన్నారని తొలి ట్రెండ్స్ చెబుతున్నాయి.
Go Back to Shorts
By Polls
Uttar Pradesh
Maharashtra
Congress
Trinamool Congress
SP
BSP

More Telugu News