హీరో విషయంలో తికమక పెడుతోన్న ధనుశ్

  • దర్శక నిర్మాతగా ధనుశ్ 
  • హీరో రాజశేఖర్ అంటూ టాక్
  • తాజాగా తెరపైకి నాగార్జున పేరు
హీరోగా .. దర్శక నిర్మాతగా ధనుశ్ కి మంచి క్రేజ్ వుంది. తాను నటించే సినిమాలే అయినా .. నిర్మించే సినిమాలే అయినా .. దర్శకత్వం వహించే మూవీస్ అయినా కొత్తదనం ఉండేలా ఆయన చూసుకుంటాడు. అలాంటి ధనుశ్ తమిళ .. తెలుగు భాషల్లో ఒక సినిమాను రూపొందించడానికి రంగంలోకి దిగాడు. తానే ఈ సినిమాకి దర్శక నిర్మాతగా వ్యవహరిస్తున్నట్టు చెప్పాడు.

ఈ సినిమాలో కథానాయకుడిగా రాజశేఖర్ నటించనున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాను ధనుశ్ తో ఒక సినిమా చేయనున్నట్టు తాజాగా నాగార్జున ప్రకటించారు. రీసెంట్ గా  ధనుశ్ ఒక కథ చెప్పాడనీ .. ఆ కథ ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో తాను వెంటనే ఓకే చెప్పేశానని అన్నారు. దాంతో రాజశేఖర్ తో ధనుశ్ చేయాలనుకున్న ప్రాజెక్టు ఇదేనా? లేదంటే అది వేరు .. ఇది వేరూనా? అనే విషయం అభిమానులను తికమకపెడుతోంది.       
Go Back to Shorts
dhanush
rajasekhar
nagarjuna

More Telugu News