హోంగార్డు కిరాతకం... ప్రేమించలేదని పాశవికంగా హత్య!
- హైదరాబాద్ లో కలకలం రేపిన ఉన్మాది ఘాతుకం
- షాప్ లో పనిచేస్తున్న యువతి గొంతుకోసిన హోంగార్డు
- ఆపై పోలీసుల ఎదుట లొంగుబాటు
ఈ క్రమంలో నిన్న షాప్ లో వెంకటలక్ష్మి ఒంటరిగా ఉన్న వేళ, అక్కడికి వచ్చిన సాగర్, తనను వివాహం చేసుకోవాలని ఆమెపై ఒత్తిడి తేవడంతో పాటు, ఆమె గొంతుకోసి దారుణంగా హతమార్చాడు.
అంతకు కొద్దిసేపటి ముందు, షాపు వద్ద అనుమానాస్పదంగా ఎవరో తిరుగుతున్నారని వెంకటలక్ష్మి యజమానికి చెప్పడంతో, ఆయన అప్రమత్తమై తన స్నేహితుడికి, వెంకటలక్ష్మి తండ్రికి సమాచారాన్ని ఇచ్చాడు. వారు వచ్చి చూసేసరికే ఆమె రక్తపు మడుగులో పడి ప్రాణాలు కోల్పోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతుండగానే, నిన్న రాత్రి పశ్చిమ మండలం టాస్క్ ఫోర్స్ పోలీసుల ఎదుట సాగర్ లొంగిపోయాడు. తనను ప్రేమించానని చెప్పి, ఆపై పెళ్లికి నిరాకరించడంతోనే ఈ దారుణానికి పాల్పడినట్టు నిందితుడు అంగీకరించాడని పోలీసు వర్గాలు వెల్లడించాయి.