చెక్కు పంపిస్తే తిప్పి పంపేశారు.. నయాపైసా తీసుకోలేదు!: అమితాబ్ ఔన్నత్యాన్ని చెప్పిన షారూక్ ఖాన్

23-05-2018 Wed 16:58 | Entertainment
  • నా సొంత బ్యానర్ పై నిర్మించిన ‘పహేళి’లో బిగ్ బీ నటించారు
  • కోటి రూపాయల చెక్ ఇస్తే అమితాబ్ తీసుకోలేదు
  • ఎందుకు తీసుకోరని అడిగా
  • నీతో కలిసి పని చేసిన ఏ సినిమాకు నేను డబ్బు తీసుకోనన్నారు 
అగ్ర తారలు తాము నటించే సినిమాలకు భారీ పారితోషికాలు తీసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా, వాణిజ్య ప్రకటనల్లో నటించినా, ఏవైనా ప్రారంభోత్సవ కార్యక్రమాలకు హాజరైనా ఎంతోకొంత తీసుకుంటూ ఉంటారు. అలాంటి సినీ పరిశ్రమలో నయాపైసా పారితోషికం తీసుకోకుండా ఎవరైనా అగ్రనటుడు ఏదైనా సినిమాలో నటించడం సాధ్యమవుతుందా? అంటే.. అవుననే చెప్పొచ్చు.

అందుకు అమితాబ్ బచ్చన్ నిదర్శనమని ఎటువంటి అనుమానం లేకుండా చెప్పొచ్చు. తాను నమ్మిన విలువలకు, ప్రేమాభిమానాలకు, స్నేహానికి ఎంతో విలువనిచ్చే అమితాబ్  ఓ సినిమాలో అతిథిపాత్రలో నటించినందుకు ఎటువంటి పారితోషికం తీసుకోలేదు. ఆ పారితోషికమేమీ చిన్నమొత్తం కూడా కాదు..అక్షరాలా కోటి రూపాయలు!

ఈ ఆసక్తికర విషయాన్ని బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. షారూక్ ఖాన్ సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్ టెయిన్ మెంట్ సుమారు పదమూడేళ్ల క్రితం తెరకెక్కించిన చిత్రం ‘పహేలి’. ఈ చిత్రంలో అమితాబ్ అతిథి పాత్రలో నటించారు. ఈ సినిమా షూటింగ్ పూర్తవగానే అమితాబ్ కు ఓ లేఖ తో పాటు కోటి రూపాయల చెక్కును పారితోషికంగా పంపానని షారూక్ చెప్పారు. తన సినిమాలో నటించడానికి అంగీకరించిన బిగ్ బీకు ఆ లేఖలో ధన్యవాదాలు తెలుపుతూ ఈ లేఖ రాశానని చెప్పారు.

అయితే, ఆశ్చర్యకరంగా తాను పంపిన చెక్ ను అమితాబ్ తిప్పి పంపేశారని.. ‘ఎందుకు తిరిగి పంపారు?’ అని తాను ప్రశ్నిస్తే అమితాబ్ చెప్పిన సమాధానం ఎన్నటికీ మరవలేనని షారూక్ చెప్పారు. ‘నీతో కలిసి పని చేసిన ఏ సినిమాకు నేను డబ్బు తీసుకోను’ అన్న అమితాబ్ సమాధానం విన్న తన ఆనందానికి అవధుల్లేవని చెప్పారు. నయాపైసా పారితోషికం తీసుకోకపోయినప్పటికీ, ఉదయాన్నే ఆరు గంటలకు సెట్స్ లో ఉండేవారని, అలాంటి గొప్ప వ్యక్తిని తానెప్పుడూ చూడలేదంటూ అమితాబ్ పై షారూక్ ప్రశంసలు కురిపించారు.
BollywoodShahrukh KhanAmitabh Bachchan

More Telugu News

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03
..more