దుబాయ్ నుంచి తిరిగొచ్చేస్తోన్న ప్రభాస్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దుబాయ్ నుంచి తిరిగొచ్చేస్తోన్న ప్రభాస్

  • సుజీత్ దర్శకత్వంలో 'సాహో' 
  • ప్రభాస్ జోడీగా శ్రద్ధా కపూర్ 
  • మేజర్ షెడ్యూల్ పూర్తి    
ప్రభాస్ క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించడంతో, ఆయన సినిమాలు భారీగా ఉండేలా దర్శక నిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారు. అలాగే ఆయన సినిమాలను వివిధ భాషల్లో విడుదల చేసే ఉద్దేశంతో రంగంలోకి దిగుతున్నారు. అలా యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్నదే 'సాహో' చిత్రం. 45 రోజులుగా ఈ సినిమా షూటింగును 'అబుదాబి'లో జరుపుతూ వస్తున్నారు. ప్రభాస్ .. శ్రద్ధా కపూర్ .. నీల్ నితిన్ ముఖేష్ .. అరుణ్ విజయ్ తదితరులు పాల్గొనగా భారీ యాక్షన్ సన్నివేశాలను అక్కడ చిత్రీకరించారు. అనుకున్నట్టుగా సంతృప్తికరమైన అవుట్ పుట్ ను రాబట్టిన ఈ సినిమా టీమ్ అక్కడ షూటింగును పూర్తిచేసి ఇండియాకి బయల్దేరుతోంది. ఇండియన్ సినిమాల్లో ఇంతవరకూ చూడని యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించినట్టు టీమ్ చెబుతోంది. ఆ సీన్ ప్రభాస్ ఫ్యాన్స్ ను ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.    
prabhas
shraddha kapoor

More Telugu News