టాప్ ట్రెండింగ్... గతంలో హీరోయిన్ అయిన కుమారస్వామి భార్య గురించి తెగ వెతికేస్తున్నారు!

  • 17 సంవత్సరాల చిన్నదైన రాధికను 2006లో వివాహమాడిన కుమారస్వామి
  • పెళ్లయిన నాలుగేళ్ల తరువాత విషయం బయటకు
  • 32 సినిమాల్లో హీరోయిన్ గా నటించిన రాధిక
కర్ణాటక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేయనున్న వేళ, నెట్టింట ఆయన భార్య, తమిళ, కన్నడ భాషల్లో 32 సినిమాల్లో హీరోయిన్ గా చేసిన రాధిక గురించి తెగ వెతికేస్తున్నారు. గూగుల్ ట్రెండింగ్ లో రాధికా కుమారస్వామి ఇప్పుడు టాప్ లో ఉన్నారు. తనకన్నా 17 సంవత్సరాలు చిన్నదైన రాధికను 2005లో పరిచయం చేసుకున్న కుమారస్వామి, ఆపై 2006లో పెళ్లి చేసుకున్నారు. ఆపై నాలుగేళ్ల తరువాత రాధిక స్వయంగా తాను కుమారస్వామిని పెళ్లి చేసుకున్నట్టు తెలిపి సంచలనమే రేపింది. 

కాగా, వీరిద్దరికీ ఇది రెండో వివాహమే కావడం గమనార్హం. 1986లో అనితను వివాహం చేసుకున్న కుమారస్వామి, ఆ తరువాత ఆమెకు విడాకులు ఇవ్వగా, 2002లో రతన్ కుమార్ ను పెళ్లాడిన రాధిక, ఆపై భేదాభిప్రాయాలతో అతనికి దూరమయ్యారు. ప్రస్తుతం రాధిక సినీ నిర్మాతగా కొనసాగుతున్నారు.
Go Back to Shorts
Radhika
Kumaraswamy
Marriage
Karnataka
Heroin

More Telugu News