కర్ణాటక అసెంబ్లీలో ఆనందంతో ఉప్పొంగిపోయిన కాంగ్రెస్-జేడీఎస్ సభ్యులు
- ఫలించని బీజేపీ ప్రయత్నాలు
- బీజేపీని ఎదుర్కునేందుకు ఎన్నో ఇబ్బందులు పడ్డ కాంగ్రెస్-జేడీఎస్
- యడ్యూరప్ప రాజీనామా నిర్ణయం ప్రకటించగానే హర్షం
యడ్యూరప్ప తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించగానే అసెంబ్లీలో కాంగ్రెస్-జేడీఎస్ నేతలు విజయ చిహ్నాన్ని చూపెడుతూ ఒకరినొకరు ఆలింగనాలు.. కరచాలనాలు చేసుకుంటూ మురిసిపోయి కనపడ్డారు. మరోవైపు ఆయా పార్టీల ఇతర నేతలు, కార్యకర్తలు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అంటున్నారు.