హీరో రాజశేఖర్ ను కలిసిన మాట నిజమే: దర్శకుడు తేజ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హీరో రాజశేఖర్ ను కలిసిన మాట నిజమే: దర్శకుడు తేజ

  • తేజ దర్శకత్వంలో మరోసారి రానా 
  • విలన్ పాత్ర కోసం రాజశేఖర్ తో సంప్రదింపులు
  • ఆ పాత్రకి రాజశేఖర్ కరెక్ట్ అంటోన్న తేజ
'నేనే రాజు నేనే మంత్రి' సినిమాను రాజశేఖర్ తో చేయాలని దర్శకుడు తేజ భావించాడుగానీ, కొన్ని కారణాల వలన అది కుదరలేదు. ఈ క్రమంలో ఇటీవల రాజశేఖర్ ను తేజ తరచూ కలుస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. 'ఉదయ్ కిరణ్' బయోపిక్ కోసమేనంటూ ప్రచారం ఊపందుకుంది. దాంతో వెంటనే స్పందించిన తేజ .. ప్రస్తుతానికి తనకి ఎలాంటి బయోపిక్ లు చేసే ఆలోచన లేదని చెప్పాడు.

అయితే రాజశేఖర్ తో చర్చలు జరుపుతున్న మాట వాస్తవమేనని అన్నాడు. రానాతో తాను చేయాలనుకుంటున్న ఒక సినిమాలో విలన్ పాత్రను రాజశేఖర్ తో చేయించాలనుకుంటున్నానని చెప్పాడు. అందుకు సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నాయని అన్నాడు. ఈ సినిమాలో విలన్ గా రాజశేఖర్ అయితేనే సరిగ్గా సరిపోతాడనీ, అందువలన ఆయననే తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నానని చెప్పాడు. మొత్తానికి రాజశేఖర్ ను విలన్ గా పరిచయం చేసే క్రెడిట్ తేజకు దక్కనుందన్న మాట .    
rajasekhar
teja

More Telugu News