నేపాల్ ముక్తినాథ్ ఆలయంలో ప్రధాని మోదీ పూజలు
- నేడు పశుపతినాథ్ ఆలయం సైతం సందర్శన
- అనంతరం నేపాల్ అధినాయకులతో చర్చలు
- తర్వాత ఢిల్లీకి తిరుగు ప్రయాణం
అనంతరం నేపాల్ కీలక నాయకులతో చర్చల్లో పాల్గొంటారు. ఖాట్మండు మెట్రో పాలిటన్ సిటీ నిర్వహించే రిసెప్షన్ లో పాల్గొన్న అనంతరం ప్రధానమంత్రి మోదీ తిరిగి ఢిల్లీకి ప్రయాణం అవుతారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో నేపాల్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ప్రధాని నిన్న జనక్ పూర్ లోని జానకీమాత ఆలయంలో కూడా పూజలు చేసిన విషయం విదితమే.