కాంగ్రెస్ కే నష్టమంటూ రేవంత్ చెప్పడం సరికాదు: పొంగులేటి
- సీఎం పదవి గురించి మాట్లాడేందుకు ఇది సమయం కాదు
- రేవంత్ కు రాహుల్ ఎలాంటి హామీ ఇవ్వలేదు
- కాంగ్రెస్ విధానాలను రేవంత్ మొదట అర్థం చేసుకోవాలి
రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ ఎలాంటి హామీ ఇవ్వలేదని పొంగులేటి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక వ్యవస్థ అని, వ్యక్తులతో పార్టీ నడవదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పద్ధతులను రేవంత్ మొదట అర్థం చేసుకోవాలని సూచించారు. పార్టీలో తనంత సీనియర్ ఎవరూ లేరని, అయినా పదవులు వచ్చినా, రాకపోయినా తాను పని చేస్తూనే ఉంటానని చెప్పారు. రేవంత్ కు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా పార్టీ వేదికపైనే మాట్లాడాలని... పార్టీకి నష్టం కలిగించే రీతిలో బహిరంగ విమర్శలు చేయడం తగదని అన్నారు.