ఫేర్‌వెల్ పార్టీకి రానని చెప్పిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్
- ఈ ఏడాది జూన్ 22న జస్టిస్ జాస్తి చలమేశ్వర్ రిటైర్మెంట్
- సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఫేర్‌వెల్ ఇవ్వడం ఆనవాయతి
- అటార్నీ జనరల్ విజ్ఞప్తి చేసినప్పటికీ ఒప్పుకోని వైనం
న్యాయమూర్తుల పదవీ విరమణ సమయంలో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఫేర్‌వెల్ పార్టీ ఇవ్వడం ఆనవాయతిగా వస్తోంది. ఈ నేపథ్యంలో బార్ అసోసియేషన్ నుంచి ఆహ్వానం అందగా జస్టిస్ చలమేశ్వర్ దాన్ని తిరస్కరించారు. అటార్నీ జనరల్ విజ్ఞప్తి చేసినప్పటికీ తనకు ఆసక్తిలేదని తెలిపారు.