ట్విట్టర్ లో కోరగానే... హారాన్ని బహుమతిగా పంపిన నరేంద్ర మోదీ!
- ఓ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ మెడలో హారం
- అలాంటిది కావాలని అడిగిన ఐఐటీ ఇంజనీరింగ్ విద్యార్థి
- వెంటనే పంపించిన నరేంద్ర మోదీ
ఆ ట్విట్టర్ ట్వీట్ ప్రధానికి కూడా చేరింది. కొన్ని రోజులకు ప్రధాని దాన్ని రబేష్ కు పంపించారు. మీ మెసేజ్ ని తాను చూశానని, ఆ దండ మీకు నచ్చిందని తెలుసుకుని దాన్ని పంపుతున్నానని, మీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని కోరుకుంటున్నానని ప్రత్యేక లేఖను కూడా పంపారు. ఇక దండ తనకు చేరగానే రబేష్ ఎంతో ఆనందించి, ఆ దండను మెడలో వేసుకుని సంబరపడ్డాడు.