'ప్రభాస్ నేషనల్ డార్లింగ్' అంటోన్న 'సాహో' విలన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'ప్రభాస్ నేషనల్ డార్లింగ్' అంటోన్న 'సాహో' విలన్

  • 'అబుదాబి'లో 'సాహో' షూటింగ్ 
  • యాక్షన్ దృశ్యాల చిత్రీకరణ
  • కథానాయికగా శ్రద్ధా కపూర్  
ప్రస్తుతం ప్రభాస్ 'సాహో' సినిమా షూటింగుతో బిజీగా వున్నాడు. 'అబుదాబి'లో ప్రభాస్ .. విలన్ నీల్ నితిన్ ముఖేశ్ తదితరులపై భారీ యాక్షన్ సీన్స్ ను చిత్రీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ గురించి నీల్ నితిన్ ముఖేశ్ స్పందించాడు. "నా దృష్టిలో ప్రభాస్ నేషనల్ డార్లింగ్ .. ఆయన ఎంతో ఆత్మీయంగా మాట్లాడతాడు. ప్రతి ఒక్కరినీ వెంటనే తన ప్రేమలో పడేసేలా చేస్తాడు"

"నా కుటుంబ సభ్యులతో ఆయన చనువుగా గడిపిన తీరు మాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది" అంటూ తాను తన భార్య ప్రభాస్ తో దిగిన ఫోటోలను షేర్ చేశాడు. ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తుండగా, ఇతర ముఖ్యమైన పాత్రల్లో జాకీ ష్రాఫ్ .. అరుణ్ విజయ్ .. చుంకీ పాండే .. మందిరా బేడీ నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతోన్న ఈ సినిమాను, తెలుగుతో పాటు తమిళ .. హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.     
prabhas
shraddha kapoor

More Telugu News