వావ్... స్టన్నింగ్ అండ్ డేరింగ్... 'సాహో' ప్రభాస్ లేటెస్ట్ స్టిల్స్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వావ్... స్టన్నింగ్ అండ్ డేరింగ్... 'సాహో' ప్రభాస్ లేటెస్ట్ స్టిల్స్!

  • శరవేగంగా సాగుతున్న 'సాహో' షూటింగ్
  • హై ఎండ్ బైక్ పై కూర్చున్న ప్రభాస్
  • స్వయంగా అభిమానులతో పంచుకున్న ప్రభాస్
'బాహుబలి: ది బిగినింగ్', 'బాహుబలి: ది కన్ క్లూజన్' చిత్రాల తరువాత కొంత గ్యాప్ తీసుకుని ప్రభాస్ నటిస్తున్న 'సాహో' చిత్రం షూటింగ్ ఇప్పుడు శరవేగంగా సాగుతోందన్న సంగతి తెలిసిందే. ఇది ప్రభాస్ కు 19వ చిత్రం కాగా, ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ స్టిల్స్ ను ప్రభాస్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు.

ఓ హైఎండ్ బైక్ పై కూర్చుని ఉన్న ప్రభాస్ స్టయిలిష్ గా, డేరింగ్ గా కనిపిస్తున్నాడని వీటిని చూసిన వారంటున్నారు. కాగా, ఈ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీసు ఆఫీసర్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన పోలీస్ యూనిఫాంలో ఉన్న ఫొటో ఒకటి ఇటీవలే ఆన్ లైన్ లో లీక్ అయింది. ప్రభాస్ పోస్టు చేసిన లేటెస్ట్ అఫీషియల్ స్టిల్స్ ను మీరూ చూడవచ్చు.
Prabhas
Sahoo
Twitter

More Telugu News