*  నయనతార మలయాళంలో నటించిన 'ఎలక్ట్రా' చిత్రాన్ని తెలుగులోకి 'లేడీ టైగర్' పేరిట డబ్ చేస్తున్నారు. బాలీవుడ్ నటి మనీషా కొయిరాల ముఖ్య పాత్ర పోషించిన ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్ ద్విపాత్రాభినయం చేశాడు.
*  ప్రస్తుతం 'నేల టికెట్టు', 'అమర్ అక్బర్ ఆంథోనీ' చిత్రాలలో నటిస్తున్న రవితేజ త్వరలో వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. పూర్తి ఎంటర్ టైనర్ గా రూపొందే ఆ చిత్రానికి 'డిస్కో రాజా' అనే టైటిల్ని నిర్ణయిస్తున్నట్టు సమాచారం.
*  త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న చిత్రం తాజా షెడ్యూల్ షూటింగ్ రేపటి వరకు జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్, ఫైటర్లపై ఓ యాక్షన్ సీన్ ను తీస్తున్నారు. ఈ దృశ్యాలలో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ లో కనిపిస్తాడట.