‘థ్యాంక్యూ మై లవ్’ అంటూ మహేశ్ బాబు పోస్ట్ చేసిన ఫొటో ఇదిగో!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘థ్యాంక్యూ మై లవ్’ అంటూ మహేశ్ బాబు పోస్ట్ చేసిన ఫొటో ఇదిగో!

  • భార్య నమ్రతకు లిప్ కిస్ ఇస్తున్న మహేశ్ బాబు
  • ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన సూపర్ స్టార్
  • ‘సో క్యూట్’ అంటున్న నెటిజన్లు
‘భరత్ అనే నేను’ విజయోత్సాహంలో ఉన్న హీరో మహేశ్ బాబు ఓ అరుదైన ఫొటోను పోస్ట్ చేశాడు. తన భార్య నమత్రకు లిప్ కిస్ ఇస్తున్న ఫొటోను మహేష్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ‘థ్యాంక్యూ మై లవ్’ అనే క్యాప్షన్ తో ఈ ఫొటోను పోస్ట్ చేశాడు. ఇక, ఈ ఫొటోపై నెటిజన్ల స్పందన అమోఘంగా ఉంది.

‘ఇంతకు ముందెన్నడూ మహేశ్ బాబును ఇలా చూడలేదు’, ‘సో క్యూట్’, ‘ఎంత అందమైన ఫొటో ఇదీ!, ‘ఈ ఫొటోకు బానిసనైపోయా’ అంటూ నెటిజన్లు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కాగా, కొరటాల శివ దర్శకత్వంలో విడుదలైన ‘భరత్ అనే నేను’ బాక్సాఫీసు రికార్డులు నెలకొల్పుతోంది. ఈ చిత్రంలో మహేశ్ బాబు సరసన కైరా అద్వాణీ నటించింది. ఇదిలా ఉండగా, వంశీ పైడిపల్లి తెరకెక్కించనున్న ఓ చిత్రంలో మహేష్ బాబు నటించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ నిమిత్తం మహేశ్ అమెరికా వెళ్లి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ కొత్త చిత్రంలో నాయికగా పూజా హెగ్డే నటించనుంది.
Mahesh Babu

More Telugu News