వైసీపీ నన్ను వాడుకోవాలని చూసింది... కలకలం రేపుతున్న శ్రీరెడ్డి ఫోన్ సంభాషణ!
- తోటి నటితో శ్రీరెడ్డి ఫోన్ సంభాషణ
- వెలుగు చూసిన సంచలన విషయాలు
- వైసీపీ నేతలు పెద్ద ప్లాన్ చేశారన్న శ్రీరెడ్డి
వైసీపీ నేతలు పెద్ద ప్లాన్ వేశారని... పోరాటం చేస్తున్న తనను వాడుకోవాలని ప్రయత్నించారని... వీలైతే మరింతగా నన్ను ఈ వివాదంలో ఇరికిద్దామని యత్నించారని చెప్పింది. అయితే, తన ఏడుపు చూసి, కొంచెం వెనక్కి తగ్గారని తెలిపింది. ఇటీవలి కాలంలో శ్రీరెడ్డి చేస్తున్న ఘాటు వ్యాఖ్యల వెనక ఎవరో ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఫోన్ సంభాషణ కీలకంగా మారబోతోందని చెబుతున్నారు.