కడుపు రగులుతోంది.. గుండె మండుతోంది: సినీ నటుడు కృష్ణుడు భావోద్వేగం

18-04-2018 Wed 17:57 | Both States
  • శ్రీరెడ్డి వ్యాఖ్యలపై ఆగ్రహం
  • ఆ మాట విన్న తర్వాత ఏం మాట్లాడాలో అర్థం కాని స్థితి
  • కోలుకోవడానికి ఇంత సమయం పట్టింది 
'కడుపు రగులుతోంది.. గుండె మండుతోంది' అంటూ సినీనటుడు కృష్ణుడు ఫేస్‌బుక్‌లో ఆవేదన వ్యక్తం చేశాడు. సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై యువనటి శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలపై కృష్ణుడు స్పందిస్తూ.. 'ఆ మాట విన్న తర్వాత ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని స్థితి నుండి కోలుకోవడానికి ఇంత సమయం పట్టింది. ఇంకా మసక మసకగా కనిపిస్తున్న స్క్రీన్ పై తడి ఆరని కళ్లతోనే ఈ మాటలు రాస్తున్నా. కడుపు రగిలిపోతోంది, గుండె మండిపోతోంది' అని పేర్కొన్నాడు.

ఆయన చేసిన వ్యాఖ్యలు యథాతథంగా..

ఒక సినిమా,
ఒక ఆడియో రీలీజ్‌,
ఒక ఇంటర్వ్యూ,
ఒక షార్ట్ ఫిల్మ్,
ఒక న్యూస్ ఛానెల్.
ప్రతీ ఒక్కడు.... ప్రతి ఒక్కడూ... పవన్ పేరుని వాడుకున్న ప్రతి ఒక్కడూ స్పందించాలి. మీ అభిమానముతోనో, మీ సినిమాకి హైప్ కోసమో, మీ ఇంటర్వ్యూ సక్సెస్ కోసమో ఆయన పేరు వాడుకున్న ప్రతి ఒక్కరు స్పందించాలి.

ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ స్పందించాలి..
ఇవాళ పవన్ కల్యాణ్ ని అన్నది, రేపు మిమ్మల్ని అంటుంది. మీరు స్పందించండి, అక్కడ పవన్ కల్యాణ్ ని అనలేదు, పవన్ తల్లిని అసభ్యంగా అన్నారు.
గొప్ప గొప్ప రచయితలు,
గొప్ప గొప్ప దర్శకులు,
గొప్ప గొప్ప లిరిసిస్ట్ లు
పెద్ద ప్రొడ్యూసర్లు,
పెద్ద దర్శకులు ఇవాళ పవన్ రేపు మీరు! మీ అమ్మల్ని, అక్కల్ని అనడానికి కూడా అది ఏ మాత్రం ఆలోచించదు. మా ఇండస్ట్రీ అంతా ఒక ఫ్యామిలీ, కళామ తల్లి ముద్దు బిడ్డలం అని చెప్పుకునే ప్రతి ఒక్కరూ గళం విప్పండి. సహనంతో ఉండే సమయం మించిపోయింది. ఓపికగా ఉండే హద్దులు పగిలిపోయాయ్. ఇక అడుగేయండి, ఒకే ఒక్క అడుగు.

అభిమానులు స్పందించండి...
ఇవాళ మా హీరో
రేపు మహేశ్ ఫాన్స్,
ఎల్లుండి ప్రభాస్ ఫాన్స్,
ఆ తర్వాత తారక్ ఫాన్స్
వదిలేస్తే మీదాక కూడా వస్తుంది. మీ హీరో మా హీరో కాదు, మన సినిమా వాళ్లు. మన ఇండస్ట్రీ గుర్తుంచుకోండి.

ఇప్పటికీ ఈ అగ్ర హీరోలపై శ్రీ రెడ్డి పోరాటం అంటుంది. కానీ, పవన్ కల్యాణ్‌ని ఆమె ఆ మాట అన్నట్లు న్యూస్‌లోనే కాదు కనీసం స్క్రోలింగ్ కూడా లేదు.

స్త్రీల గౌరవం కోసం పోరాడే మహిళా సంఘాలు ఎక్కడికి పోయాయి? పవన్ కల్యాణ్ అమ్మ కూడా ఒక స్త్రీనే! ఒక స్త్రీ గౌరవం కోసం స్పందించకపోతే మీరు చేసే పోరాటానికి అర్థమేముంది?

ప్రేక్షకులు, ప్రజలు కూడా స్పందించండి.. సినిమా వాళ్ళు ఏ ఆదివారమో, నెలకోసారో నువ్వూ నీ ఫ్యామిలీ సరదాగా హాల్ కెళ్తే మిమ్మల్ని నవ్వించే, ఆనందంగా ఇంటికి పంపించే సినిమా వాడు కదా మీరు కూడా స్పందించండి.

ఇప్పుడు నాకు భాస్కరభట్ల గారి మాటలు గుర్తొస్తున్నాయి...
' సరదాగా మీరంతా మా సినిమాలే చూస్తారండి
అయినా మేమంటే ఓ చిన్న చూపులేండి!'.
krishnuduPawan Kalyansri reddy

More Telugu News

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25
..more