టీవీ చానల్ ముందు ప్రత్యక్షమైన బ్యూటీషియన్ జ్యోతి ప్రియుడు సందీప్!

18-04-2018 Wed 10:59 | Both States
  • మూడు రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో జ్యోతి మృతి
  • ఘటనతో తనకు సంబంధం లేదన్న సందీప్
  • పోలీసులు గాలిస్తుండగా టీవీ చానల్ లో ప్రత్యక్షం
మూడు రోజుల క్రితం వికారాబాద్ జిల్లా తాండూరుకు రైలులో వెళుతూ, పట్టాలపై విగతజీవిగా కనిపించిన బ్యూటీషియన్ జ్యోతి ప్రియుడు ఓ టీవీ చానల్ ముందు ప్రత్యక్షమై, ఆమె మృతితో తనకు ఎటువంటి సంబంధమూ లేదని చెప్పాడు. జ్యోతి మృతి వెనుక సందీప్ హస్తం ఉండవచ్చని ఆమె కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో తొలి అనుమానితుడిగా సందీప్ పేరునే చేర్చిన పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.

ఈ నేపథ్యంలో టీవీ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన సందీప్, తనను అనవసరంగా అనుమానిస్తున్నారని, ఆరోజు రైలులో ఏం జరిగిందో తేలాల్సి వుందని చెప్పాడు. జ్యోతి చాలా తెలివైన అమ్మాయని, ఇద్దరమూ పెళ్లి చేసుకోవాలని, అందుకు ఇంట్లో వాళ్ల అనుమతి తీసుకోవాలని భావించామని చెప్పాడు. రెగ్యులర్ గా తాము ప్రతి ఆదివారం కలుస్తుంటామని, తాను అమ్మమ్మ వాళ్ల ఇంటికి వస్తున్నానని, అక్కడ కలుద్దామని చెప్పిందని, ఆపై జ్యోతి కనిపించడం లేదని వాళ్ల ఇంటి నుంచే తనకు ఫోన్ వచ్చిందని చెప్పాడు. వెంటనే తన స్నేహితుడిని తీసుకుని వికారాబాద్ కు వెళ్లానని అన్నాడు. జ్యోతి మరణం తనను కలచి వేసిందని చెప్పాడు. తమ మధ్య ఎలాంటి గొడవలూ లేవని, ఆమె చనిపోయిన తరువాత వాళ్ల ఊరికి వెళితే, తనను కొడతారని భయపడే వెళ్లలేదని సందీప్ అన్నాడు.
BeautisianJyothiSandeepRailway Track

More Telugu News

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37
..more