gov't officials dance: కార్యాలయాన్ని క్లబ్ గా మార్చేసిన ఉద్యోగులు..వీడియో చూడండి

  • బాధ్యత మరచిన ప్రభుత్వ ఉద్యోగులు
  • కార్యాలయంలో ఉద్యోగి పుట్టినరోజు వేడుకలు
  • సినిమా పాటలకు చిందులు
కార్యాలయాన్ని క్లబ్ గా మార్చేసి చిందేసిన ఘటన మధ్యప్రదేశ్ లో వెలుగు చూసింది. దాని వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ లోని దేవాస్ లో గల మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో ఒక ఉద్యోగి పుట్టిన రోజు వేడుకలను అతని సహోద్యోగులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ కార్యాలయాన్ని క్లబ్ గా మార్చేసి చిందేశారు. స్త్రీ, పురుష బేధం లేకుండా ఉద్యోగులు విధి నిర్వహణను గాలికి వదిలేసి, సినిమా పాటలకు చిందేస్తూ ఆటపాటల్లో మునిగితేలారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వెలుగు చూడడంతో అప్రమత్తమైన అధికారులు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.   
gov't officials dance
office dance
Madhya Pradesh

More Telugu News