మహేశ్ తో ఓ సినిమా చేయాలనేది నా కల .. అది నిజమైంది!: నిర్మాత డీవీవీ దానయ్య
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మహేశ్ తో ఓ సినిమా చేయాలనేది నా కల .. అది నిజమైంది!: నిర్మాత డీవీవీ దానయ్య

  • నిర్మాతగా సుదీర్ఘమైన ప్రయాణం చేశాను 
  • మహేశ్ తో ఓ సినిమా చేయాలనుకున్నాను 
  • అది కొరటాల ద్వారా నెరవేరింది
మహేశ్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలోని 'భరత్ అనే నేను' సినిమాను నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దానయ్య మాట్లాడుతూ .. "నిర్మాతగా 25 సంవత్సరాలుగా ప్రయాణాన్ని కొనసాగిస్తూ వస్తున్నాను" అని చెప్పారు.

"తాజాగా 'భరత్ అనే నేను' సినిమాను నిర్మించాను. మహేశ్ బాబుతో ఓ సినిమా చేయాలనేది నా కల. ఎప్పటి నుంచో నేను ఆయన చుట్టూ తిరుగుతూ వున్నాను. ఆ కోరిక కొరటాల ద్వారా నెరవేరడం నాకెంతో ఆనందాన్ని కలిగిస్తోంది. కొరటాల ..మహేశ్ లతో కలిసి పనిచేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది మా బ్యానర్ గర్వపడే సినిమా అవుతుందనే నమ్మకం వుంది" అంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 
mahesh babu
kiaraadvani

More Telugu News