పవన్ కల్యాణ్'ని 'అన్న’ అన్నందుకు నా చెప్పుతో నేను కొట్టుకుంటున్నా!: సినీ నటి శ్రీశక్తి

16-04-2018 Mon 20:36 | Entertainment
  • నువ్వు ప్రజానాయకుడివి అయి ఉండి ఏం మాట్లాడుతున్నావు?
  • పోలీస్ స్టేషన్ కు వెళ్లమనే సలహా నువ్వు చెప్పాలా?
  • ఇకపై పవన్ కల్యాణ్ ని ఏ అమ్మాయి కూడా ‘అన్న’ అనొద్దు
జనసేన పార్టీ అధినేత, అగ్ర హీరో పవన్ కల్యాణ్ పై మహిళా నటి  శ్రీ శక్తి (శ్రీరెడ్డి) తీవ్ర వ్యాఖ్యలు చేసింది. 'తెలుగు సినీ రంగంలో లైంగిక, ఆర్థిక దోపిడీ’ అంశంపై రెండో రోజూ చర్చా కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్ లోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడుతూ, ‘ఒక్కొక్కళ్ల జాతకాలు బయటకొచ్చినప్పుడు.. హీరోలకు సంబంధించిన అభిమానులు దయచేసి మమ్మల్ని వేధింపులకు గురి చేయొద్దు. పవన్ కల్యాణ్ ! నువ్వు ప్రజానాయకుడివి అయి ఉండి ఏం మాట్లాడుతున్నావు? పోలీస్ స్టేషన్ కు వెళ్లమని చెబుతున్నావు? నువ్వు చెప్పాలి నాకు సలహా! ‘పవన్ కల్యాణ్ అన్న’ అన్నందుకు నా చెప్పుతో నేను కొట్టుకుంటున్నా. ఇకపై పవన్ కల్యాణ్ ని ఏ అమ్మాయి కూడా ‘అన్న’ అనొద్దు..’ అంటూ రాయడానికి వీలులేని భాషలో పవన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

పవన్ కల్యాణ్ గారూ!  మీ ఫ్యాన్స్ ని కంట్రోల్ లో పెట్టుకోలేరా?

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పై శ్రీశక్తి విరుచుకుపడింది. చర్చా కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ,
‘పవన్ కల్యాణ్ గారి ఫ్యాన్స్ కి నేనొక్కటే చెబుతున్నా. కొన్నిరోజులుగా మేము నోరు విప్పి మాట్లాడుతున్నాం.. మమ్మల్ని తొక్కేసే ప్రయత్నాలు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ గారూ! మీ ఫ్యాన్స్ ని ఆమాత్రం కంట్రోల్ లో పెట్టుకోలేరా? అసలు ఆయనకు ఒక్కరికే ఫ్యాన్స్ ఉన్నారా? మేము భయపడాల్సిన అవసరమేమీ లేదు’ అని చెప్పింది.

మేము ఎలా బతకాలి?

సినిమాల్లో అవకాశాలు దొరక్క, ఉపాధిలేక, పూటగడవని ఆర్టిస్టులు వ్యభిచారం బాట పడితే, ప్రభుత్వం దానిని కూడా బ్యాన్ చేసిందని, మరి ఆర్టిస్టులు ఎలా బతకాలి అని శ్రీశక్తి ప్రశ్నించింది. ‘వ్యభిచారాన్ని ప్రభుత్వం బ్యాన్ చేసింది. నిర్లజ్జగా, నిస్సిగ్గుగా అడుగుతున్నా. మరి, మేము ఎలా బతకాలి? మీరు (సినీ ఇండస్ట్రీ) అన్నం పెట్టరు. మేము ఆర్టిస్టులం.. ఆర్టిస్టులుగానే ఉంటాం..ఇక్కడే చచ్చిపోతాం. మాకు వేరే అవసరం లేదు. కళామతల్లికే మా జీవితం అంకితం. పెట్టుబడిదారుడు వాడి ఇష్టం వచ్చినట్టు వాడు సినిమా తీసుకుంటాడు. మీకెందుకు అవకాశాలిస్తారని కొంతమంది నిర్మాతలు మాట్లాడుతున్నారు. ముంబై వాళ్లను ఆర్టిస్టులుగా తీసుకుంటే ముంబైకు, విదేశీ ఆర్టిస్టులను తీసుకుంటే విదేశాలకు వెళ్లి సినిమాలు తీసుకుని, అక్కడే రిలీజ్ చేసుకోండి. తెలుగు ప్రాంతాల్లో ఆ సినిమాలను రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు’ అని శ్రీశక్తి తన ఆవేదన వ్యక్తం చేసింది.
Pawan Kalyansri shakti

More Telugu News

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25
..more