ఫిల్మ్ నగరా? లేక రెడ్ లైట్ ఏరియానా? ఎలా పిలవాలో నాకు అర్థం కావట్లేదు! : సినీ నటి శ్రీశక్తి

15-04-2018 Sun 21:06 | Both States
  • ఫిల్మ్ నగర్ లోని అన్ని ఆఫీసులు బ్రోతల్ హౌస్ లైపోయాయి
  • సాయంత్రం ఆరు దాటితే వారి విచ్చలవిడి చేష్టలకు అంతులేదు
  • ‘మా’కు తొత్తులుగా బతికే మహిళలు ఇంకా అక్కడే ఉన్నారు
  • అలా పిరికి పందల్లా ఎన్నిరోజులు బతుకుతారు?
‘తెలుగు సినీ పరిశ్రమలో లైంగిక, ఆర్థిక దోపిడి’ అనే అంశంపై హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బహిరంగ చర్చ నిర్వహించారు. మహిళా సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ చర్చలో పాల్గొన్న నటి శ్రీశక్తి (శ్రీరెడ్డి) మాట్లాడుతూ, ఫిల్మ్ నగర్ లోని అన్ని ఆఫీసులు బ్రోతల్ హౌస్ లు అయిపోయాయని, సాయంత్రం ఆరు దాటితే వారి విచ్చలవిడి చేష్టలకు అంతులేదని ఆరోపించారు.

‘నేను ఏమైనా మాట్లాడితే బూతులు మాట్లాడిందంటున్నారు. సినిమాల్లో అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతూ చాలా ఇబ్బందులు పడుతున్నాం. ‘బట్టలిప్పేసింది’ అని గోల చేస్తున్నారు. ఎవరి బట్టలిప్పేశాను? మీ బట్టలు ఊడదీశాను. ప్రపంచ దేశాలు నవ్వుతున్నాయి... మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)లో సభ్యత్వం ఉన్న నటి అపూర్వ అక్క మా కోసం ఈరోజు బయటకు వచ్చి పోరాటం చేస్తున్నారు. ‘మా’ సభ్యత్వం తన కొద్దని చెప్పి, అసోసియేషన్ నుంచి ఆమె బయటికి వచ్చేశారు’ అని చెప్పింది.

‘మా’కు అనుకూలంగా మాట్లాడుతున్న మహిళా ఆర్టిస్టులను ఉద్దేశించి శ్రీ శక్తి మాట్లాడుతూ, ‘మా’కు తొత్తులుగా బతికే మహిళలు ఇంకా అక్కడే ఉన్నారని, అలా పిరికి పందల్లా ఎన్నిరోజులు బతుకుతారు? అని ప్రశ్నించారు. సినీ పరిశ్రమలో లొంగిపోకపోతే అవకాశాలు లేవని, అలా అని చెప్పి అందరూ అలానే లొంగిపోతారని తాను చెప్పడం లేదని, తప్పు చేయని వారు కూడా ఉన్నారని శ్రీశక్తి చెప్పింది. అయితే, తనకు ఎదురైన సంఘటనలన్నీ బాధాకరమైనవేనని, అయినప్పటికీ, తనను మోసం చేశారని తెలిపింది. తన చేతకానితనాన్ని అదునుగా తీసుకుని తనపై నిషేధం విధించారని, అందుకే మహిళా శక్తి నిద్రలేచిందని ఆమె పేర్కొంది.
Tollywoodsri shakti

More Telugu News

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03
..more