అయ్యా.. జగన్ గారూ.. రూ.5 వేల కోట్లు ఇప్పించండి.. అగ్రిగోల్డ్ ఆస్తులన్నీ మీకే!: కుటుంబరావు

14-04-2018 Sat 06:42 | Both States
  • జగన్ తన మీడియా ద్వారా అసత్య ప్రచారం చేయిస్తున్నారు
  • అగ్రిగోల్డ్ ఆస్తుల విలువ రూ.35 వేల కోట్లట
  • సదావర్తి భూముల విషయంలోనూ ఇలాగే చేశారు
  • జగన్ ఓకే అంటే కోర్టుతో మాట్లాడతాం
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై ఏపీ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్ ఆస్తులకు సంబంధించి తన మీడియాలో వార్తలు రాయిస్తున్న జగన్ వాటి విలువ రూ.35 వేల కోట్ల వరకు ఉంటుందని పదేపదే చెబుతున్నారని,  కానీ ఆయన రూ.5 వేల కోట్లు ఇప్పిస్తే ఆ ఆస్తులు మొత్తం ఆయనకు ఇప్పించేలా కోర్టుకు విజ్ఞప్తి చేస్తామని అన్నారు. జగన్ దీనికి ముందుకు రావాలని, రూ.35 వేల కోట్ల విలువైన ఆస్తులను కేవలం రూ.5 వేల కోట్లకే సొంతం చేసుకునే అద్భుత అవకాశాన్ని వదులుకోవద్దని సూచించారు.

దుష్ప్రచారం జగన్‌కు మామూలేనని, గతంలో సదావర్తి సత్రం భూముల విషయంలోనూ జగన్ ఇలాగే తన మీడియాలో వాటి విలువను పెంచి రాయించారని గుర్తు చేశారు. వాటి విలువ రూ.1000 కోట్లు ఉంటుందని తన మీడియాలో రాయించారని, వేలానికి పెడితే వచ్చిన ధర ఎంతో అందరికీ తెలుసని అన్నారు.

ఏపీలోని అగ్రిగోల్డ్ ఆస్తుల విలువ రూ.4 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశామని, హైకోర్టు వేసిన కమిటీ రూ.6900 కోట్ల వరకు ఉంటుందని లెక్కకట్టిందని పేర్కొన్న కుటుంబరావు ఇవన్నీ తెలిసి కూడా జగన్ అసత్య ప్రచారం చేస్తున్నారని దుమ్మెత్తి పోశారు. అగ్రిగోల్డ్ డిపాజిటర్ల సంఘం ప్రతినిధులను జగన్ కంపెనీల ప్రతినిధులు కలిసి మాట్లాడారని, కాబట్టి ఈ ఆస్తులను వారినే కొనుగోలు చేయాలని చెబుతున్నామని అన్నారు.

కంపెనీ ఆస్తులను తొలుత కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిన ఎస్సెల్ గ్రూపు తర్వాత వెనక్కి తగ్గిందన్నారు. కోర్టు అనుమతి ఇస్తే సీబీసీఐడీ ఆధ్వర్యంలో ఆస్తుల వేలం నిర్వహిస్తామని కుటుంబరావు తెలిపారు.
AgrigoldAndhra PradeshYS JaganKutumba Rao

More Telugu News

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03
..more