ఇళ్ల స్థలాల పంపిణీలో అర్హులకే ప్రాధాన్యమివ్వాలి : ఏపీ సీఎస్ దినేష్ కుమార్

12-04-2018 Thu 22:07 | Andhra
  • ఇళ్ల స్థలాలకు కేవలం పట్టాలు మంజూరు చేస్తే సరిపోదు
  • గృహ నిర్మాణ పథకాల కింద లబ్ధిదారులును ఎంపిక చేయాలి
  • పేదల సొంతింటి కలను నెరవేర్చాలి
ఇళ్ల స్థలాల పంపిణీలో అర్హులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఆదేశించారు. సచివాలయంలోని తన కార్యాలయంలో ఏపీటిడ్కో, రెవెన్యూ, సాంఘిక సంక్షేమ శాఖాధికారులతో ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. తొలుత, రాష్ట్రంలో ఇంత వరకూ ఎన్ని పట్టాలు మంజూరు చేశారనే విషయాన్ని తెలియజేస్తూ సీసీఎల్ఏ కమిషనర్ అనిల్ చంద్ర పునీత్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.

రాష్ట్రంలో 2014 నుంచి నేటి వరకూ 3,45,853 ఇళ్ల స్థలాల పట్టాలు మంజూరు చేసినట్లు తెలిపారు. కొత్తగా ఇళ్ల స్థలాల పట్టాల కోసం పట్టణ, గ్రామీణ ప్రాంతాల నుంచి 19.82 లక్షల మందికి పైగా దరఖాస్తులు చేసుకున్నారని, వారిలో 5,98,118 మందిని అర్హులుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాలకు చెందిన వారు 2,99,246 మంది, గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు 2,98,872 మంది ఉన్నారన్నారు. తాజాగా 5,98,118 మందికి ఇళ్ల స్థలాల పంపిణీకి చర్యలు తీసుకోవాల్సి ఉందని వివరించారు.

ఈ సందర్భంగా దినేష్ కుమార్ మాట్లాడుతూ, ఇళ్ల స్థలాలకు కేవలం పట్టాలు మాత్రమే మంజూరు చేయడం వల్ల పేదలకు ఆశించిన స్థాయిలో ప్రయోజనం కలగదని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ గృహ నిర్మాణ పథకాల కింద వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని సూచించారు. తద్వారా పేదలకు పక్కా ఇళ్లు కట్టుకునే అవకాశం కలుగుతుందని చెప్పారు. అందరికీ ఆవాసం కల్పించాలన్న ప్రభుత్వ ఆశయం కూడా నెరవేరుతుందని అన్నారు.

జక్కంపూడి ఎకనామిక్ టౌన్ షిప్ నిర్మాణ వేగవంతం చేయండి

విజయవాడ కార్పొరేషన్ లో 24 గంటలూ తాగునీటి కల్పన, జక్కంపూడి ఎకనామిక్ టౌన్ షిప్ నిర్మాణంపై ప్రగతి గురించి దినేష్ కుమార్ అడిగి తెలుసుకున్నారు. తాగునీటి సరఫరాపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని, వృథాగా పోతున్న తాగునీటికి అడ్డుకట్టవేయాలని,  ఈ టౌన్ షిప్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.
Andhra Pradeshcs dinesh kumar

More Telugu News

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37
..more