దిల్ రాజుపై కోపంతో రాత్రికి రాత్రే సినిమాను ఎనౌన్స్ చేశాను: దర్శకుడు సుకుమార్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దిల్ రాజుపై కోపంతో రాత్రికి రాత్రే సినిమాను ఎనౌన్స్ చేశాను: దర్శకుడు సుకుమార్

  • 'జగడం' సినిమాను మహేష్ లేదా బన్నీ కోసం రాసుకున్నా
  • బన్నీతో తీయాలని చూస్తే దిల్ రాజుతో సమస్య వచ్చింది
  • వెంటనే రామ్ తో సినిమా ప్రకటించాను
  • సినిమా పోవడంతో ఎలా ఉండాలో తెలిసిందన్న సుకుమార్
'ఆర్య' చిత్రం ముగిసిన తరువాత బన్నీతో 'జగడం' సినిమాను తీయాలని భావించానని, అయితే, నిర్మాత దిల్ రాజుతో సమస్య వచ్చి రాత్రికి రాత్రి రామ్ హీరోగా ఆ చిత్రాన్ని ప్రకటించేశానని 'రంగస్థలం'తో సూపర్ హిట్ కొట్టిన సుకుమార్ వ్యాఖ్యానించాడు. ఏబీఎన్ చానల్ కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సుకుమార్ ఈ ఆసక్తికర విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. 'జగడం' కథను మహేష్ బాబు లేదా అల్లు అర్జున్ లలో ఒకరిని హీరోగా అనుకుని రాసుకున్నానని, తమ్ముడి పాత్రలో రామ్ ను పెట్టాలని అనుకున్నానని, చివరకు రామ్ హీరో కాగా, తమ్ముడి పాత్ర మరింత చిన్నగా మారిపోయిందని చెప్పాడు.

 ఈ సినిమా ఓపెనింగ్ కు దిల్ రాజును, బన్నీని పిలిచానని, దిల్ రాజు వచ్చి, "బుద్ధుందా? ఏమి చేస్తున్నావు నువ్వు?" అని ప్రశ్నిస్తే, "నాకు కోపం వచ్చింది" అని చెప్పానని, "కోపం వస్తే సినిమా మొదలు పెడతావా?" అని చీవాట్లు పెట్టారని చెప్పుకొచ్చాడు. 'జగడం' సినిమా ఫ్లాప్ కావడంతో ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో తెలిసొచ్చిందని చెప్పాడు. ఆపై మహేష్ బాబుతో తీసిన '1 నేనొక్కడినే' చిత్రం సూపర్ హిట్ అవుతుందని ఎంతో నమ్మానని, పల్లెటూర్లలో ఉండే చదువుకోని వారికి సినిమా అర్థం కాదన్న విషయాన్ని పట్టించుకోకనే ఫెయిల్ అయ్యానని చెప్పాడు. తాను చాలా తొందరగా ఎమోషన్స్ కు లోనవుతుంటానని, ఈ స్థితి నుంచి బయట పడేందుకు ప్రయత్నిస్తున్నానని అన్నాడు.
Sukumkar
Allu Arjun
Mahesh Babu

More Telugu News