నేరుగా తెలుగు సినిమా చేయడానికి సిద్ధమైన కార్తీ?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేరుగా తెలుగు సినిమా చేయడానికి సిద్ధమైన కార్తీ?

  • తెలుగులోను కార్తీకి క్రేజ్ 
  • కథ వినిపించిన వేణు ఊడుగుల
  • ఓకే చెప్పేసిన కార్తీ    
తమిళంలోనే కాదు .. తెలుగులోనూ కార్తీకి మంచి క్రేజ్ వుంది. ఇక్కడి యూత్ లోను .. మాస్ ఆడియన్స్ లోను ఆయనకి ఎంతోమంది అభిమానులు వున్నారు. ఈ కారణంగానే తన తమిళ సినిమాలు అక్కడే కాకుండా తెలుగులోను భారీ స్థాయిలో విడుదలయ్యేలా ఆయన చూసుకుంటూ ఉంటాడు. తరచూ అనువాద చిత్రాల్లో కనిపించి బోర్ కొట్టేసిందనీ .. త్వరలో నేరుగా ఒక తెలుగు సినిమా చేస్తానని ఈ మధ్య ఆయన చెప్పాడు.

అన్నట్టుగానే దర్శకుడు వేణు ఊడుగులకు  ఆయన గ్రీన్స్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం. ఇటీవల వేణు ఊడుగుల తెరకెక్కించిన 'నీది నాదీ ఒకే కథ' సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా వేణు వినిపించిన కథ నచ్చడంతో సినిమా చేయడానికి కార్తీ ఓకే చెప్పేశాడని అంటున్నారు. తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమా రూపొందనుందని చెబుతున్నారు. మరి ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి.   
karthi
venu

More Telugu News