మేజర్ షెడ్యూల్ కోసం రంగంలోకి ప్రభాస్ .. కోట్ల ఖర్చుతో యాక్షన్ సీన్స్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మేజర్ షెడ్యూల్ కోసం రంగంలోకి ప్రభాస్ .. కోట్ల ఖర్చుతో యాక్షన్ సీన్స్

  • 'సాహో' కోసం భారీ యాక్షన్  సీన్స్ 
  • హాలీవుడ్ స్టంట్ మాస్టర్ తో ప్రభాస్
  • అబుదాబిలో 40 రోజుల షూటింగ్     
ప్రభాస్ నటిస్తున్న 'సాహో' సినిమా టీమ్ మేజర్ షెడ్యూల్ షూటింగ్ కోసం చాలా రోజుల క్రితమే 'అబుదాబి' వెళ్లవలసి వుంది. అయితే కొన్ని కారణాల వలన ఈ షెడ్యూల్ వాయిదాపడుతూ వచ్చింది. ఎట్టకేలకు అక్కడి షెడ్యూల్ ను ఆరంభించే డేట్ ఖరారైంది.

 ఈ నెల 10వ తేదీ నుంచి 'అబుదాబి'లోని వివిధ ప్రాంతాల్లో రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. బుర్జ్ ఖలీఫాతో పాటు మరికొన్ని ముఖ్యమైన లొకేషన్స్ లో 40 రోజుల పాటు ఈ షూటింగ్ జరగనుంది. హాలీవుడ్ స్టంట్ మాస్టర్ 'కెన్నీ బేట్స్' అధ్వర్యంలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ను చిత్రీకరించనున్నారు. ఇందుకోసం హాలీవుడ్ స్థాయిలో కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నారట. ప్రభాస్ జోడీగా ఇందులో శ్రద్ధా కపూర్ కనిపించనున్న సంగతి తెలిసిందే.   
prabhas
shraddha kapoor

More Telugu News