'సూయీ ధాగా' షూటింగ్ లో వరుణ్ ధావన్, అనుష్క శర్మల సాయం కోరిన ఢిల్లీ పోలీసులు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'సూయీ ధాగా' షూటింగ్ లో వరుణ్ ధావన్, అనుష్క శర్మల సాయం కోరిన ఢిల్లీ పోలీసులు

  • 'సూయీ ధాగా' సినిమా షూటింగ్ లో బిజీగా అనుష్క, వరుణ్ ధావన్
  • ఢిల్లీలో షూటింగ్ జరుపుకుంటున్న సూయీ ధాగా
  • షూటింగ్ స్పాట్ లో అనుష్క, వరుణ్ ను కలిసిన ఢిల్లీ పోలీసులు
ఢిల్లీ పోలీసులు బాలీవుడ్‌ నటులు వరుణ్ ధావన్, అనుష్క శర్మల సాయం కోరారు. వీరిద్దరూ జంటగా ‘సూయీ ధాగా- మేడ్‌ ఇన్‌ ఇండియా’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఢిల్లీలోని చాందినీ చౌక్‌, శంకర్‌ మార్కెట్ ప్రాంతాల్లో జరుగుతోంది.

ఈ సందర్భంగా చిత్రయూనిట్ ను సంప్రదించిన పోలీసులు, వారిద్దరినీ కలిశారు. ట్రాఫిక్‌ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు నిర్వహించే కార్యక్రమంలో పాలుపంచుకోవాల్సిందిగా కోరారు. అయితే, బిజీ షెడ్యూలు కారణంగా, కార్యక్రమంలో పాల్గొనే సమయం వారికి లేకపోవడంతో, అప్పటికప్పుడు వారితో వీడియో రూపొందించారు.

ఈ వీడియోలో అనుష్క మాట్లాడుతూ, ‘మన జాగ్రత్త కోసం ఢిల్లీ పోలీసులు చాలా కష్టపడుతుంటారు. జీవితం ఎంతో విలువైనది. ద్విచక్రవాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. తప్పకుండా హెల్మెట్లు ధరించాలి’ అని సూచించింది. దీనిని ఢిల్లీ పోలీసులు త్వరలో సోషల్ మీడియా మాధ్యమంగా విడుదల చేయనున్నారు.
suidhaga
movie shoot
varun dhawan
Anushka Sharma

More Telugu News