రామ్ చరణ్ నటించిన 'రంగస్థలం' ఈ రోజు విడుదలైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా బాగుందనే టాక్ ను సంపాదించుకుంది. ఈ సందర్భంగా చెర్రీకి ప్రముఖ సినీ నటుడు అరవిందస్వామి బెస్ట్ విషెస్ చెప్పారు. 'ఈ సినిమా గురించి ఇప్పటికే మంచి విషయాలు వింటున్నా. రామ్ చరణ్ కు, మొత్తం టీమ్ కు ఆల్ ది వెరీ బెస్ట్' అంటూ ట్వీట్ చేశారు. రామ్ చరణ్ నటించిన 'ధృవ' సినిమాలో అరవిందస్వామి ప్రతి నాయకుడి పాత్రను పోషించిన సంగతి తెలిసిందే.