ప్రముఖ నటుడు కమలహాసన్ తన చిన్న కుమార్తె అక్షర హాసన్‌తో కలిసి జిమ్‌కి వెళ్లారు. కథకి తగ్గట్టుగా శరీరాకృతిని మార్చుకోవడం నేటి హీరోహీరోయిన్లకు తప్పనిసరి అయిపోయింది. అయితే తన కొత్త సినిమా ప్రాజెక్టు కోసం కమల్ జిమ్‌కి వెళ్లడం లేదు. ఆయన కుమార్తె అక్షర హాసన్ 'గుడ్ బై గర్ల్' అనే నవల ఆధారంగా రూపొందనున్న ఓ వెబ్ సిరీస్‌లో నటించబోతోంది.

న్యాయం కోసం పోరాడే 18 ఏళ్ల బాలిక జీవితం ఆధారంగా రూపొందనున్న ఈ వెబ్‌సిరీస్‌కు ఆదిత్య దత్ దర్శకత్వం వహించనున్నారు. ఈ సిరీస్ కోసం ఆమె కాస్త ఒళ్లు పెంచాల్సి ఉంది. అందుకే ఫిట్‌నెస్ ట్రైనర్ సూరి పర్యవేక్షణలో ఆమె జిమ్ చేస్తున్నారు. అక్షరతో పాటు జిమ్‌కు సరదాగా వెళ్లిన కమల్..ఓ ఫొటో తీసి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫొటో ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది.