మహేశ్ అభిమానులకు నమ్రత థ్యాంక్స్!
- మహేశ్‌ని వీడియోలో బంధించేందుకు ప్రయత్నించిన అభిమానులకు థ్యాంక్స్
- ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో అప్‌లోడ్
- అభిమానుల ప్రేమకు తిరిగి అదే స్థాయిలో ప్రేమను చూపుతున్న వైనం
తాజాగా మహేశ్ అభిమానులకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోని పోస్ట్ చేయడం ద్వారా ఆమె కృతజ్ఞతలు తెలిపింది. మహేశ్ బాబు తన షూటింగ్ ముగించుకుని తిరిగి వెళ్తుండగా అభిమానులు ఉల్లాసంగా అరుస్తూ తమ అభిమాన నటుడ్ని మొబైల్ కెమేరాల్లో బంధించేందుకు ప్రయత్నిస్తున్న వీడియోని ఆమె పోస్ట్ చేసింది. బహుశా, వారి అభిమానానికి ముగ్ధురాలై ఆమె ఇలా వీడియోని పోస్ట్ చేసినట్లుంది. తమపై వారు చూపిస్తున్న ప్రేమను తిరిగి అదే స్థాయిలో వారికి ఇలా పంచుతుండటం ఎంతైనా ఆహ్వానించదగ్గ విషయం.