బస్టాండ్ లో షూటింగ్... సాదా చీరలో అనుష్క శర్మ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బస్టాండ్ లో షూటింగ్... సాదా చీరలో అనుష్క శర్మ!

  • మధ్యప్రదేశ్ లో 'సుయిధాగా' సినిమా షూటింగ్
  • హలాల్ పుర బస్టాండ్ లో సాదా చీరలో కనిపించిన అనుష్క
  • మేక్ ఇన్ ఇండియా స్పూర్తితో 'సుయిధాగా'
మధ్యప్రదేశ్‌ లో భోపాల్‌ లోని హలాల్‌ పుర్ బస్టాండ్‌ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య, ప్రముఖ బాలీవుడ్ నటి అనుష్క శర్మ సాధారణ చందరీ చీరను ధరించి బస్సెక్కుతూ కనిపించింది. అనుష్క ఏంటి, సాధారణ చీరలో కనిపించడమేంటని ఆశ్చర్యపోతున్నారా?... వరుణ్ ధావన్, అనుష్క శర్మ జతగా 'సూయి ధాగా' సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. చందేరీ చీరల తయారీలో కష్టనష్టాలను చూపిస్తూ ‘మేక్ ఇన్ ఇండియా’ థీమ్‌ తో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను వాస్తవ లొకేషన్లలో చిత్రీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనుష్క శర్మ బస్టాండ్ లో కనిపించింది. దీంతో అనుష్కను చూసేందుకు భారీ ఎత్తున స్థానికులు తరలివచ్చారు. 
suidhaga
anushka
Anushka Sharma
varun dhawan
varun

More Telugu News