చంద్రబాబు మైండ్ అప్పుడే ఎన్నికల గురించి ఆలోచిస్తోంది: అంబటి రాంబాబు
- పరిణామాలు చకచకా మారిపోతున్నాయి
- చంద్రబాబుకు డిపాజిట్ కూడా రాదు
- ఇన్నిసార్లు మాట మార్చిన వ్యక్తి చంద్రబాబు ఒక్కరే
ఇన్నిసార్లు మాటలు మార్చిన వ్యక్తి దేశంలో చంద్రబాబు ఒక్కరే ఉంటారని దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా రాకుండా చంద్రబాబు నాలుగేళ్లు అడ్డుకున్నారని విమర్శించారు. చంద్రబాబు మైండ్ అప్పుడే ఎన్నికల గురించి ఆలోచిస్తోందని... పరిణామాలు చకచకా మారిపోతుండటమే దానికి కారణమని అన్నారు. రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుకు డిపాజిట్లు కూడా రావని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావాలని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు.