షమి దుబాయ్ లో రెండు రోజులున్నాడని కోల్ కతా పోలీసులకు తెలిపిన బీసీసీఐ
- సౌతాఫ్రికాలో షమీ పర్యటన వివరాలు అందించాలని బీసీసీఐ ని కోరిన కోల్ కతా పోలీసులు
- షమీ పర్యటన వివరాలు అందించిన బీసీసీఐ
- ఫిబ్రవరి 17, 18 తేదీల్లో షమీ దుబాయ్ లో గడిపాడని స్పష్టీకరణ
ఆ లేఖలో ఫిబ్రవరి 17, 18తేదీల్లో మహమ్మద్ షమీ దుబాయ్ లో ఉన్నాడని బీసీసీఐ పేర్కొందని కోల్ కతా జాయింట్ సీపీ ప్రవీణ్ త్రిపాఠి తెలిపారు. దీనిపై తదుపరి విచారణ ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. షమీ కుటుంబ సభ్యులు తనకు నిద్రమాత్రలు ఇచ్చి హతమార్చే ప్రయత్నం చేశారన్న హసీన్ జహాన్ ఆరోపణలపై విచారణ ప్రారంభించినట్టు బీసీసీఐ తెలిపింది. ఆ సమయంలో ఆమెకు చికిత్స చేసిన వైద్యుడిని బీసీసీఐ అధికారులు కలవనున్నట్టు తెలుస్తోంది.