తండ్రికి ఉంచకుండా మందు తాగేశాడని కొడుకును మందలించిన తల్లి... అవమానంతో ఆత్మహత్యాయత్నం!
- ఉగాది నాడు ఘటన
- ఇంటికి తెచ్చిన మద్యాన్ని ఒక్కడే తాగిన కొడుకు
- ఆపై తల్లి తిట్టిందని ఆత్మహత్యాయత్నం
- కేసును విచారిస్తున్న పోలీసులు
అయితే, రాత్రిపూట తండ్రికి తెలియకుండా మహేష్ ఒక్కడే మొత్తం తాగేశాడు. తండ్రికి మద్యం లేకుండా చేశావని, పండగపూట ఈ పని ఏంటని తల్లి మహేష్ ను మందలించింది. దీంతో ఆ మత్తులోనే ఒంటిపై కిరోసిన్ పోసుకున్న మహేష్, నిప్పంటించుకుని, బాధకు తాళలేక కేకలు వేశాడు. దీంతో స్థానికులు స్పందించి మంటలను ఆర్పి, చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. జరిగిన ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.