మొత్తానికి 'తొలిప్రేమ' డైరెక్టర్ వైపే మొగ్గుచూపిన అఖిల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మొత్తానికి 'తొలిప్రేమ' డైరెక్టర్ వైపే మొగ్గుచూపిన అఖిల్

  • మూడవ సినిమాకి సిద్ధమైన అఖిల్ 
  • వెంకీ అట్లూరి కథకి గ్రీన్ సిగ్నల్ 
  • త్వరలో పూర్తి వివరాలు  
అఖిల్ రెండవ సినిమా 'హలో' ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది. కాకపోతే అఖిల్ మరింత హ్యాండ్సమ్ గా కనిపించాడనీ .. నటన పరంగా కొంత పరిణతిని కనబరిచాడని చెప్పుకున్నారు. 'హలో' ప్రేక్షకుల ముందుకు వచ్చి కొంతకాలమవుతున్నా అఖిల్ తన తదుపరి సినిమా విషయంలో ఇంతవరకూ ఏమీ తేల్చలేదు.

 తాజాగా 'తొలిప్రేమ' దర్శకుడు వెంకీ అట్లూరితో ఒక సినిమా చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. ఆయన వినిపించిన కథకు నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా చెప్పుకున్నారు. అయితే కొరటాల శివతో చేసే ఛాన్స్ కూడా ఉందనే టాక్ వచ్చింది. ఈ క్రమంలో అఖిల్ ఎవరితో చేస్తాడా అనే సందిగ్ధం ఏర్పడింది. తన తదుపరి సినిమాకి దర్శకుడిగా ఆయన వెంకీ అట్లూరినే ఎంపిక చేసుకున్నాడనేది తాజా సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.      
akhil
venky atluri

More Telugu News