అప్పుడే కోటి వ్యూస్ సాధించిన మహేశ్ బాబు కొత్త సినిమా టీజర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అప్పుడే కోటి వ్యూస్ సాధించిన మహేశ్ బాబు కొత్త సినిమా టీజర్

  • 'ది విజన్‌ ఆఫ్‌ భరత్' పేరిట నిన్న టీజ‌ర్ విడుద‌ల
  • మహేశ్ బాబు డైలాగులు అదుర్స్
  • అత్యధిక వ్యూస్ తో దూసుకుపోతున్న టీజర్
మ‌హేశ్ బాబు, కొర‌టాల శివ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటోన్న‌ 'భరత్ అనే నేను' సినిమాకు సంబంధించి 'ది విజన్‌ ఆఫ్‌ భరత్' పేరిట నిన్న టీజ‌ర్ విడుద‌లైన విష‌యం తెలిసిందే. ఇందులో మహేశ్ బాబు ముఖ్యమంత్రిగా కనబ‌డుతూ, త‌నదైన శైలిలో చెబుతోన్న డైలాగులు అల‌రిస్తున్నాయి. ఒక ఫిక్షనల్ పొలిటికల్ డ్రామాగా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా నుంచి వ‌చ్చిన ఈ టీజ‌ర్ సినిమాపై అంచనాల‌ను మ‌రింత పెంచేసింది. కాగా, ఈ టీజ‌ర్ విడుద‌లైన 19 గంట‌ల్లోనే కోటి డిజిట‌ల్ వ్యూస్ సాధించింది. ప్ర‌స్తుతం మరింత ముందుకు దూసుకుపోతోంది. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మ‌హేశ్ స‌ర‌స‌న‌ కైరా అద్వానీ నటిస్తోంది. ఈ సినిమా ఏప్రిల్ 20న విడుదల కానుంది.  
Mahesh Babu

More Telugu News