రాజమౌళి, ప్రభాస్ జపాన్ సందడి గురించి తెలుసా?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాజమౌళి, ప్రభాస్ జపాన్ సందడి గురించి తెలుసా?

  • జపాన్ లో విడుదలైన 'బాహుబలి 2'
  • వన్ మిలియన్ మార్క్ దాటిన కలెక్షన్స్
  • ఆనందాన్ని పంచుకున్న చిత్ర నిర్మాతలు
దర్శక దిగ్గజం రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన 'బాహుబలి' ఇప్పుడు జపాన్ లో ప్రభంజనం చూపిస్తోంది. చాలా దేశాల్లో రెండు భాగాలుగా విడుదలై కలెక్షన్ల సునామీలు సృష్టించిన 'బాహుబలి'ని ఇప్పుడు జపాన్ ప్రజలు అక్కున చేర్చుకున్నారు. 'బాహుబలి: ది కన్ క్లూజన్' ఇటీవల జపాన్ లో విడుదలై హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఇప్పటికే వన్ మిలియన్ మార్క్ ను దాటేసిన మూవీ, మరిన్ని కలెక్షన్ల దిశగా సాగుతుండగా, ఆ ఆనందాన్ని చిత్ర నిర్మాతలు తమ ట్విట్టర్ ఖాతాలో అభిమానులతో పంచుకున్నారు. ఇటీవలే రెండో భాగంలోని 'సాహోరే బాహుబలి' పాట 10 కోట్ల వ్యూస్ సాధించిందని, ఇప్పుడు జపాన్ లో సత్తా చాటుతోందని వారు వ్యాఖ్యానించారు.
Bahubali 2
Japan
Telugu
Movie
Rajamouli
Prabhas

More Telugu News